ఆమెకు 60 ఏళ్లు.. అతనికి 22 ఏళ్లు.. | 60 Year Old Mother Fall In Love WIth 22 Year Old Man In UP | Sakshi
Sakshi News home page

60 ఏళ్ల బామ్మతో 22 ఏళ్ల యువకుడి ప్రేమాయణం

Jan 23 2020 8:55 PM | Updated on Jan 23 2020 9:19 PM

60 Year Old Mother Fall In Love WIth 22 Year Old Man In UP - Sakshi

ఆమెకు 60 ఏళ్లు..ఏడుగురు పిల్లలు.. 22 ఏళ్ల యువకుడితో..

ఆగ్రా : ఆమెకు 60 ఏళ్లు.. ఏడుగురు పిల్లలు. అతను 22 ఏళ్ల యువకుడు. వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఆమె భర్త, పిల్లలను కాదని ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటానని పట్టుపడుతోంది. ఇక ఆ యువకుడు తను ఆమెను తప్ప మరోకరని వివాహం చేసుకోనని భీష్మీంచుకుని కుర్చున్నాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఈ విచిత్రమైన ప్రేమకథ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మొదలైంది.

వివరాల్లోకి వెళితే.. ఆగ్రాలోని ఎట్మదుద్దౌలా ప్రాంతానికి చెందిన ఓ 60 ఏళ్ల మహిళ అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. భర్తతో పాటు ఏడుగురి పిల్లలను వదిలి ఆ యువకుడితో కలిసి ఉండడానికి ఇష్టపడింది. ఈ విషయంపై ఆమె ఇంట్లో గొడవకు కూడా దిగారు. దీంతో ఆమె భర్త, కుమారుడు కలిసి యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో యువకుడు కూడా కుటుంబ సభ్యులతో కలిసి అదే పోలీసుస్టేషన్‌కు వచ్చాడు. పోలీసుస్టేషన్‌ ఎదుటే ఇరువురు గొడవ పడ్డారు.

పోలీసులు జోక్యం చేసుకొని ఇరువురికి కౌన్సిలింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇరువురి కుటుంబసభ్యులు కూడా వారి వివాహానికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ తాము కలిసే ఉంటామని.. తమ వివాహానికి ఎవరి అనుమతి అవసరంలేదని ఆ జంట తేల్చి చెప్పింది. ఆ జంట మనసులు మార్చడానికి పోలీసులు చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. తమ మధ్య ఎవరి జ్యోక్యం అవసరంలేదని, తాము కలిసే ఉంటామని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. ఇక సేష్టన్‌ ఎదుట గొడవపడినందుకుగాను యువకుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి ఈ విచిత్ర ప్రేమ జంట పెళ్లి చేసుకుంటుందా లేదా కుటుంబసభ్యుల అభ్యర్థన మేరకు విడిపోతారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement