విజయవాడ ఎయిర్‌పోర్టుకు సీఐఎస్‌ఎఫ్‌ రక్షణ | 4 more airports to get CISF security cover | Sakshi
Sakshi News home page

విజయవాడ ఎయిర్‌పోర్టుకు సీఐఎస్‌ఎఫ్‌ రక్షణ

Mar 19 2018 2:09 AM | Updated on Mar 19 2018 2:09 AM

4 more airports to get CISF security cover  - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పౌర విమానాశ్రయాలకు భద్రత కల్పించే కేంద్ర పారిశ్రామిక భద్రతా సంస్థ(సీఐఎస్‌ఎఫ్‌) త్వరలోనే షిర్డీ(మహారాష్ట్ర), జామ్‌నగర్‌(గుజరాత్‌), విజయవాడ(ఆంధ్రప్రదేశ్‌),జబల్‌పూర్‌(మధ్యప్రదేశ్‌) ఎయిర్‌పోర్టులకు రక్షణ కల్పించనుంది.

ఈ నాలుగు విమానాశ్రయాలకు సీఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పించాలని గతంలోనే  కేంద్రం నిర్ణయించినప్పటికీ కొన్ని కారణాల వల్ల సిబ్బందిని ఇప్పటివరకూ కేటాయించలేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీఐఎస్‌ఎఫ్‌ 59 పౌర విమానాశ్రయాలకు రక్షణ కల్పిస్తోంది. సీఐఎస్‌ఎఫ్‌లో ప్రత్యేక విభాగమైన ఏవియేషన్‌ సెక్యూరిటీ గ్రూప్‌ హైజాకింగ్‌తో పాటు ఎయిర్‌పోర్టులపై ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా చర్యలు తీసుకుంటుంది. 

Advertisement
 
Advertisement
Advertisement