నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్
జమ్మూ: ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతాబలగాలు సోదాలు చేపట్టి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఘటన జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకుంది. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని దార్ మొహల్లా వాటరిగమ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మరణించిన ఉగ్రవాదులు లష్కరే తోయిబా, హిజ్బుల్ ఉగ్రసంస్థలకు చెందిన ముజఫర్ అహ్మద్ భట్, ఒమర్ అమీన్ భట్, సాజద్ అహ్మద్ భట్, గుల్జార్ అహ్మద్ భట్‌లుగా గుర్తించారు. ఇందులో గుల్జార్ హిజ్బుల్‌కు చెందిన ఉగ్రవాది కాగా, మిగిలిన వారు లష్కరే తోయిబాకు చెందిన వారు. వీరంతా కుల్గామ్ జిల్లాకు చెందిన వారని అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి రెండు ఏకే 47 రైఫిళ్లు, రెండు పిస్తోళ్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి