110 అడుగుల బోరుబావిలో చిన్నారి | 3 Years Child Fall Into 110 Feet Borewell In Bihar | Sakshi
Sakshi News home page

110 అడుగుల బోరుబావిలో పడ్డ  మూడేళ్ల బాలిక

Aug 1 2018 4:58 PM | Updated on Aug 1 2018 5:07 PM

3 Years Child Fall Into 110 Feet Borewell In Bihar - Sakshi

బోరుబావి వద్ద బాలిక తల్లి, అధికారులు చేపట్టిన సహాయక చర్యలు

సన్నో అనే మూడేళ్ల బాలిక ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. ప్రమాదవశాత్తు ఇంట్లో నిర్మాణంలో ఉన్న మూతలేని బోరుబావిలో...

పాట్నా : ప్రమాదవశాత్తు మూడేళ్ల బాలిక 110 అడుగుల బోరుబావిలో పడిపోయింది. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం బీహార్‌ రాష్ట్రంలోని ముంగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని ముంగర్‌ జిల్లా ముర్గియాచక్‌ అనే గ్రామంలో సన్నో అనే మూడేళ్ల బాలిక ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. ప్రమాదవశాత్తు ఇంట్లో నిర్మాణంలో ఉన్న మూతలేని బోరుబావిలో పడిపోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంబంధిత అధికారులకు సమాచారమివ్వటంతో సహాయక చర్యలు ఊపందుకున్నాయి.

ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారి సంజీవ్‌ మాట్లాడుతూ.. బోరుబావిలోని బాలిక క్షేమంగా ఉందన్నారు. బాలికను బయటకు తీసుకురావటానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. బాలిక ఊపిరి తీసుకోవటానికి ఆక్సిజన్‌ అందిస్తున్నామని తెలిపారు. బాలిక మరింత కిందకు జారిపోకుండా ఉండేలా రాడ్లను ఉంచామన్నారు. బాలికను బయటకు తేవటానికి మరో నాలుగు గంటల సమయం పట్టవచ్చని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement