అటవీ ప్రాంతంలో వివాహితపై గ్యాంగ్ రేప్ | 25-yr-old gangraped in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

అటవీ ప్రాంతంలో వివాహితపై గ్యాంగ్ రేప్

Oct 5 2014 11:42 AM | Updated on Sep 2 2017 2:23 PM

అటవీ ప్రాంతంలో వివాహితపై గ్యాంగ్ రేప్

అటవీ ప్రాంతంలో వివాహితపై గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో దారుణం చోటు చేసుకుంది.

ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో దారుణం చోటు చేసుకుంది. స్నేహితురాలితో కలసి ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన వివాహిత(25) పై ఇద్దరు యువకులు దాడి చేసి... అనంతరం సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆ యువకులు అక్కడి నుంచి పరారైయారు. దీంతో బాధితురాలు సివిల్ లైన్స పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా నిందితులు బమన్హెరీ గ్రామానికి చెందిన ఉత్తమ్ చంద్, బావర్ సింగ్గా గుర్తించి... అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. బాధితురాలికి వివాహమైందని ఆమెకు ఒక చిన్నారి కూడా ఉందని పోలీసులు వెల్లడించారు. అయితే అడవికి వెళ్లిన స్నేహితురాలిని అక్కడి నుంచి వెళ్లి పోవాలని బెదిరించారని చెప్పారు. దీంతో ఆమె భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. అత్యాచారం చేసే క్రమంలో ప్రతిఘటించిన యువతిపై ఇద్దరు యువకులును దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement