గంటలో 247 అడ్మిషన్లు!

247 Students Take Admissions At Kerala Govt School In One Hour - Sakshi

ప్రవేశాల్లో ప్రత్యేకతను చాటుకుంటున్న కేరళ స్కూల్‌

తిరువనంతపురం: నాణ్యమైన విద్యను అందిస్తే.. ఆ పాఠశాలకు, టీచర్లకు పిల్లల్లో, తల్లిదండ్రుల్లో ఎంతటి డిమాండ్‌ ఉంటుందో చెప్పేందుకు కేరళలలోని ఓ పాఠశాల తాజా ఉదాహరణగా నిలుస్తోంది. చదువంటే కేవలం అక్షరాలు రుద్దించడం మాత్రమే కాదని, పిల్లల్ని అన్నివిధాలా తీర్చిదిద్దడమేనని నిరూపిస్తున్న సదరు పాఠశాలలో ప్రవేశాలకు క్యూ కడుతున్నారు. ప్రవేశాలను ప్రారంభించిన తొలి గంటలోనే 247 మంది చేరారంటే.. ఆ పాఠశాల మిగతావాటి కంటే భిన్నమైనదనే చెప్పాలి.

వివరాల్లోకెళ్తే.. కేరళలోని అలప్పుజా జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశాల కోసం మే 3న 15 కౌంటర్లు తెరిచారు. దీంతో ఒక్క గంటలోనే 247 మంది ప్రవేశం పొందారు. ఫస్ట్‌ క్లాసులో 170 మంది, రెండో తరగతిలో ఆరుగురు, మూడో తరగతిలో ఐదుగురు విద్యార్థులు అడ్మిషన్స్‌ తీసుకున్నారు. ఇక ఎల్‌కేజీ, యూకేజీలోనైతే భారీగా చేరారు. ఇంతగా ఈ పాఠశాలలో చేరడానికి కారణమేంటంటే.. ఇక్కడ చదువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. ఎక్స్‌ట్రా – కరిక్యూలర్‌ యాక్టివిటీస్‌ చేయించడానికి కూడా అంతకు మించి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే గతేడాది రెండున్నర గంటల్లో 233 మంది విద్యార్థులు అడ్మిషన్స్‌ తీసుకున్నారు. ఈసారి ఆ రికార్డు బ్రేక్‌ అయ్యింది. కాగా ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంటుందని పాఠశాల ప్రిన్సిపాల్‌ ఆర్‌ పుష్పలత తెలిపారు. మొత్తంగా ఈ పాఠశాలలో 650 మంది విద్యార్థులు చదువుతున్నారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top