20 మంది మెట్రోరైల్‌ ఉద్యోగులకు కరోనా | 20 Delhi Metro Staff Have Tested Positive For COVID-19 | Sakshi
Sakshi News home page

మెట్రోరైల్‌ ఉద్యోగులకు 20 మందికి కరోనా

Jun 5 2020 11:36 AM | Updated on Jun 5 2020 11:49 AM

20 Delhi Metro Staff Have Tested Positive For COVID-19 - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మెట్రోరైలు కార్పోరేషన్‌లో పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. తమ సంస్థలో పని చేసే వివిధ స్థాయి ఉద్యోగులకు వైరస్ సోకినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. దీనిపై ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) ట్వీట్‌ చేస్తూ.. ‘దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దానిపై పోరాడుతున్నాము. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అన్ని చర్యలు తీసుకొని మెట్రో సర్వీసులను పరుగులు పెట్టించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ’ ఢిల్లీ మెట్రోరైలు మస్కట్, మాస్క్, గ్లోవ్స్ ధరించిన బాలిక పోస్టరును అధికారులు ట్వీట్ చేశారు.

మెట్రోరైలు కార్యాలయాలు, రైల్వేస్టేషన్లు శానిటైజ్ చేయిస్తూ కరోనా విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మెట్రోరైలు అధికారులు వెల్గడించారు. కాగా ఢిల్లీలో ఇప్పటిదాకా.. 23,645 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 606 మంది మరణించారు. 9,542 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. చదవండి: భారత్‌లో కొత్తగా 9,851 కేసులు

Advertisement
 
Advertisement
Advertisement