మధ్యప్రదేశ్ లోని ఛాతార్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
స్కూల్ బస్సుకు ప్రమాదం, 20 మందికి గాయాలు
Nov 26 2016 10:56 AM | Updated on Apr 3 2019 7:53 PM
ఛాతార్పూర్: మధ్యప్రదేశ్ లోని ఛాతార్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి పడిపోవడంతో ఇరవై మంది చిన్నారులకు గాయాలయ్యాయి. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన విద్యార్ధులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Advertisement
Advertisement