కారు బీభత్సం.. ఇద్దరి మృతి | 2 Killed, 4 Injured After Speeding Car Runs Over Labourers in Ahmedabad | Sakshi
Sakshi News home page

కారు బీభత్సం.. ఇద్దరి మృతి

Jun 10 2015 10:37 AM | Updated on Aug 14 2018 3:22 PM

కారు బీభత్సం.. ఇద్దరి మృతి - Sakshi

కారు బీభత్సం.. ఇద్దరి మృతి

అహ్మదాబాద్లో ఓ కారు బీభత్సం సృష్టించింది.

అహ్మదాబాద్: అహ్మదాబాద్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి రోడ్డుప్రక్కన నిద్రిస్తున్న కార్మికులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, నలుగురు గాయపడ్డారు. మృతుల్లో ఒక మహిళ, రెండేళ్ల చిన్నారి ఉన్నట్టు తెలుస్తోంది.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. అతివేగంగా కారు నడిపి కార్మికుల మృతికి కారణమైన కారు డ్రైవర్, అతని స్నేహితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement