ఒక్క స్థానం.. 18 వేలమంది బందోబస్త్‌ | 18000 Security Personnel on Duty For Dantewada Bypoll | Sakshi
Sakshi News home page

ఒక్క స్థానం.. 18 వేలమంది బందోబస్త్‌

Sep 21 2019 8:37 PM | Updated on Sep 21 2019 8:39 PM

18000 Security Personnel on Duty For Dantewada Bypoll - Sakshi

రాయ్‌పూర్‌: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబర్‌ 21న పోలింగ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం​ ఏకంగా 18వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పోలీసుశాఖ తెలిపింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా దంతేవాడ ఎమ్మెల్యే అయిన భీమా మాండవిని గత ఏప్రిల్లో మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మావోయిస్టులకు ప్రధాన కేంద్రంగా ఉన్న దంతెవాడలో ఎన్నిక నిర్వహణ అంతా సులభమైన విషయం కాదు. అలాగే మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు డోన్‌ల సహాయం కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


 

Advertisement
 
Advertisement
Advertisement