కరోనాను లెక్క చేయక.. 140 కి.మీ ప్రయాణించింది

140 Kilometers 8 Hours Woman Drove Covid-19 Survivor To Home - Sakshi

మహిళా ఆటో డ్రైవర్‌ ధైర్యం.. 8 గంటల పాటు ప్రయాణం

సీఎం బీరేన్‌ సింగ్‌ ప్రశంసలు.. నగదు బహుమతి

ఇంపాల్‌: కరోనా వచ్చిన నాటి నుంచి మన జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. బంధువులు లేరు.. వేడుకలు లేవు. ఎక్కడికైనా వెళ్లాలంటే అంటే ఈ మాయదారి రోగం ఎక్కడ అంటుకుంటుందో అనే భయం. సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక కరోనా బారిన పడిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నెగిటివ్‌ వచ్చినప్పటికి ఇంకా వారిని వివక్షతోనే చూస్తున్నారు. తిరిగి ఇంటికి తీసుకెళ్లాలన్నా కుటుంబ సభ్యులు జంకుతున్నారు. ఇలాంటి సమయంలో కరోనా నుంచి కోలుకున్న ఓ పేషెంట్‌కి, ఒక మహిళ ఆటో డ్రైవర్ సహాయం చేసింది. ఆస్పత్రి నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేషెంట్‌ స్వగ్రామానికి మహిళా డ్రైవర్‌ తన ఆటోలో తీసుకెళ్లింది. మణిపూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన పట్ల ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళా ఆటో డ్రైవర్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వివరాలు.. 

సోమిచాన్‌ చితుంగ్‌(22) అనే యువతి మే నెలలో కోల్‌కతా నుంచి మణిపూర్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో జవహర్‌లాల్‌ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఆమెకి చికిత్స అందించారు. 14 రోజుల చికిత్స తర్వాత మే 31న ఆమెకి కరోనా నెగిటివ్‌గా తేలింది. దాంతో వైద్యులు చితుంగ్‌ని డిశ్చార్జ్‌ చేశారు. అయితే ఆమె స్వగ్రామం కామ్‌జాంగ్‌ వరకు అంబులెన్స్‌ ఏర్పాటు చేయడానికి ఆస్పత్రి సిబ్బంది అంగీకరించలేదు. ఈ విషయాన్ని ఆమె తండ్రికి తెలిపింది. ఆయన ప్రైవేట్‌ వాహనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. కానీ కరోనా నుంచి కోలుకున్న పేషంట్‌ని తీసుకురావలని చెప్పడంతో ఎవరూ ముందుకు రాలేదు. ఈ సంగతి కాస్తా లైబికి తెలిసింది. కరోనా భయంతో ఎవరు ముందుకు రాకపోవడంతో తానే చితుంగ్‌ని ఇంటికి చేర్చాలని నిర్ణయించుకుంది. వెంటనే వెళ్లి తాను చితుంగ్‌ని ఇంటికి తీసుకెళ్తానని చెప్పింది. (లాక్‌డౌన్‌ వల్ల కలిగిన లాభం ఇదే..!)

నా మాటలను సీరియస్‌గా తీసుకోలేదు
దీని గురించి లైబి మాట్లాడుతూ.. ‘మొదట వారు నా మాటల్ని సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో నాకు సొంత ఆటో ఉందని.. దాదాపు పదేళ్ల నుంచి ఆటో నడుపుతున్నానని వారికి చెప్పాను. జాగ్రత్తగా తీసుకెళ్తానని చెప్పి ఒప్పించాను. అప్పుడు వారు నా ఆటోలో రావడానికి అంగీకరించారు. మే 31 రాత్రి మొదలైన మా ప్రయాణం జూన్‌ 1న ముగిసింది. సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న చితుంగ్‌ ఇంటికి చేరుకోవడానికి దాదాపు ఎనిమిది గంటల సమయం పట్టింది. ఇందుకు గాను వారి వద్ద నుంచి రూ.5 వేల రూపాయల కిరాయి తీసుకున్నాను. మాతో పాటు నా భర్త ఓనమ్‌ రాజేంద్ర కూడా ఉన్నాడు’ అని చెప్పుకొచ్చింది లైబి. (పోలీస్‌ భార్య ప్రేమ)

నా జీవితంలో అత్యంత కష్టమైన ప్రయాణం
తన జీవితంలో ఇది అత్యంత కష్టతరమైన ప్రయాణం అని చెప్పుకొచ్చింది లైబి. ‘కమ్జోంగ్‌ వరకు పొగమంచు కురుస్తుంది. నా ఆటో హెడ్‌లైట్‌ సరిగా పని చేయడం లేదు. రోడ్డు కూడా బాగాలేదు. అంతా గుంతలు గుంతలుగా ఉంది. ఎలాగైతేనేం చితుంగ్‌ని క్షేమంగా ఇంటికి చేర్చాను’ అని లైబి చెప్పుకొచ్చింది. అనంతరం చితుంగ్‌ మాట్లాడుతూ.. ‘లైబికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఆమె చేసిన సాయాన్ని ఎన్నటికి మరిచిపోను. ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే’ అన్నారు. దీని గురించి తెలుసుకున్న మణిపూర్ చీఫ్ మినిస్టర్ ఎన్ బీరెన్ సింగ్ లైబిని ప్రశంసించారు. ‘జేఎన్‌ఐఎమ్‌ఎస్ నుంచి డిశ్చార్జ్ అయిన అమ్మాయిని తీసుకెళ్లడానికి హాస్పటల్ సిబ్బంది నిరాకరించారు. ఇతర ప్రైవేట్‌ వాహనదారుల ముందుకు రాలేదు. కానీ వీటిని లెక్కచేయకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ పేషెంట్‌ని ఇంటికి తీసుకెళ్లిన పంగేకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీమతి లైబీ ఓనమ్‌ను 1,10,000 రూపాయల నగదు బహుమతితో గౌరవించడం ఆనందంగా ఉంది. ఇంఫాల్ నుంచి కమ్‌జోంగ్‌కు ఎనిమిది గంటలపాటు ఆటో నడిపిన ఆమె సేవ ఎంతో అభినందనీయం' అని ప్రశంసిస్తూ బీరెన్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు.(పాజిటివ్‌ ఉన్నా లక్షణాల్లేవా!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

28-01-2021
Jan 28, 2021, 05:36 IST
సాక్షి, అమరావతి: కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా బుధవారం 7,598 మందికి వ్యాక్సిన్‌ వేశారు. వీరిలో కోవిషీల్డ్‌ (సీరం కంపెనీ) వ్యాక్సిన్‌...
27-01-2021
Jan 27, 2021, 17:22 IST
కరోనా టీకాపై సామన్యుడి ఆలోచన ఎలా ఉంది? అందుబాటులోకి వచ్చినప్పుడు వేయించుకుంటారా?
27-01-2021
Jan 27, 2021, 16:38 IST
భువనేశ్వర్‌: కరోనా వ్యాక్సిన్‌ వచ్చిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కోవిడ్‌ టీకా వేసుకున్నవారు మరణిస్తుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఒడిశాలో...
27-01-2021
Jan 27, 2021, 15:48 IST
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త రకం కరోఏనా వైరస్‌ కేసులో భారత్‌లో పెరుగుతున్న నేపథ్యంలో టీకా తయారీదారు భారత్‌ బయోటెక్‌ కీలక విషయాన్ని ప్రకటించింది....
27-01-2021
Jan 27, 2021, 05:24 IST
కరోనా మహమ్మారి చైనాలోని వూహాన్‌లో బట్టబయలై ఏడాది దాటినప్పటికీ ఇంకా ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తూనే ఉంది.
26-01-2021
Jan 26, 2021, 13:46 IST
టీకా తొలి డోసు తీసుక్ను కస్టమర్లకు 10 శాతం, రెండు డోసులు తీసుకున్నవారికి 20 శాతం డిస్కౌంట్‌ ఇస్తామని ప్రకటించింది....
26-01-2021
Jan 26, 2021, 02:06 IST
కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ సురక్షితమైనవి అజయ్‌ భల్లా అన్నారు.
26-01-2021
Jan 26, 2021, 01:33 IST
ఏటా విడుదలయ్యే నివేదికల్లో ప్రపంచవ్యాప్తంగా వున్న ఆర్థిక అసమానతలనూ, వాటి పర్యవసానంగా ఏర్పడే ఇతరత్రా అంతరాలనూ ఆక్స్‌ఫాం ఏకరువు పెడుతుంది....
25-01-2021
Jan 25, 2021, 21:30 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 27,717 మందికి కరోనా పరీక్షలు చేయగా 56 మందికి పాజిటివ్‌ వచ్చింది....
25-01-2021
Jan 25, 2021, 16:40 IST
కోవిడ్‌ మహమ్మారిని తరిమికట్టడంలో ప్రపంచదేశాలతో భారత్‌ పోటీపడుతోంది.
25-01-2021
Jan 25, 2021, 12:47 IST
మెక్సికో: ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా వైరస్‌ నివారణ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తున్నప్పటికీ  కరోనా మహమ్మారి ప్రకంపనలు ఇంకా...
25-01-2021
Jan 25, 2021, 12:36 IST
జగిత్యాల‌: కరోనా మహమ్మారి రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల చొప్పున వ్యాక్సిన్‌...
25-01-2021
Jan 25, 2021, 02:02 IST
కోపెన్‌హాగెన్‌: బ్రిటన్‌లో కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌ యూరప్‌ని ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. 70శాతం వేగంగా కొత్త స్ట్రెయిన్‌ కేసులు వ్యాప్తి...
24-01-2021
Jan 24, 2021, 17:43 IST
ఈ నెల 22న వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఆమె మరణించారు. అయితే వ్యాక్సిన్‌ వల్లే ఆమె మృతి చెందిందని బంధువులు అనుమానాలు వ్యక్తం...
24-01-2021
Jan 24, 2021, 08:43 IST
కోవిడ్‌ కట్టడికి ప్రపంచమంతా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంటే.. అమెరికాకు చెందిన ఎలి లిలీ అనే ఫార్మా కంపెనీ మరో...
24-01-2021
Jan 24, 2021, 04:28 IST
లాస్‌ ఏంజెలిస్‌: అర్ధ శతాబ్దానికి పైగా ప్రపంచ నేతలు, సినీ రంగ ప్రముఖులు మొదలుకొని సామాన్యుల దాకా ముఖాముఖిలు నిర్వహించి...
23-01-2021
Jan 23, 2021, 21:08 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 43,770 మందికి కరోనా పరీక్షలు చేయగా 158 మందికి పాజిటివ్‌ వచ్చింది....
23-01-2021
Jan 23, 2021, 17:30 IST
హాంకాంగ్ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో హాంకాంగ్‌లోని కోలూన్ ప్రాంతంలో లాక్‌డౌన్‌ విధించింది. అక్కడ నివసించే 10వేలమంది నివాసితులు తప్పనిసరిగా...
23-01-2021
Jan 23, 2021, 12:50 IST
కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ పంపడంతో బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్ బొల్సనారో భారతదేశంపై ప్రశంసలు కురిపించాడు. రామాయణంలో హనుమంతుడు సంజీవని తీసుకొచ్చి...
23-01-2021
Jan 23, 2021, 11:23 IST
కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌.. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి కిలోమీటర్‌ దూరంలో ఉంది. దీంతో వ్యాక్సిన్ల ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top