14 కోట్ల పాన్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానం

14 crores of pan cards to connect with aadhaar - Sakshi

న్యూఢిల్లీ: పాన్‌ కార్డులను ఆధార్‌తో అనుసంధానించినవారి సంఖ్య ఇప్పటికి 14 కోట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి ఈ పాన్‌ (పర్మినెంట్‌ ఎకౌంట్‌ నంబర్‌)కార్డులున్నాయి. ఈ విషయాన్ని యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ ) ప్రధాన కార్యనిర్వహణ అధికారి అజయ్‌ భూషణ్‌ ఆదివారం వెల్లడించారు.

100 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఉండగా అందులో 70 కోట్ల మంది తమ ఖాతాలను ఆధార్‌ నంబర్‌తో అనుసంధానించారని ఆయన చెప్పారు. కాగా బ్యాంకు ఖాతాలు, మొబైల్‌ నంబర్లకు ఆధార్‌ సంఖ్యను అనుసంధాన గడువును సుప్రీంకోర్టు గతవారం వచ్చే ఏడాది మార్చి ఆఖరువరకూ పొడిగించడం తెలిసిందే. పన్ను ఎగవేతలు, నకిలీ ఖాతాలకు తెరదించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ అనుసంధాన ప్రక్రియను చేపట్టింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top