బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించడంలో రాష్ర్ట గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి చేస్తున్న జాప్యంపై జేడీయూ నేత
పాట్నా: బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించడంలో రాష్ర్ట గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి చేస్తున్న జాప్యంపై జేడీయూ నేత నితీశ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా రాష్ర్టపతి ప్రణబ్‌ముఖర్జీ ఎదుట పరేడ్ నిర్వహించేందుకు తనకు మద్దతిస్తున్న 130 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మంగళవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
నితీశ్ ఇప్పటికే బుధవారం రాష్ర్టపతి అపాయింట్‌మెంట్ కోరారు. ఢిల్లీకి వెళ్లడానికి ముందు పార్టీ ముఖ్య నేతలతో కలిసి పాట్నాలో ఆయన మీడియాతో మాట్లాడారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను కూడా సమర్పించిన త ర్వాత గవర్నర్ ఇంకా సమయం తీసుకోవడం ఎందుకని, 48 గంటలు గడిచినా నిర్ణయం తీసుకోకపోవడంలో అర్థం లేదని నితీశ్ పేర్కొన్నారు.