సిగరెట్లు తీసుకురాలేదని బాలుడి హత్య | 13-year-old killed for not fetching cigarettes | Sakshi
Sakshi News home page

సిగరెట్లు తీసుకురాలేదని బాలుడి హత్య

Jun 23 2015 8:53 AM | Updated on Jul 12 2019 3:29 PM

సిగరెట్లు తీసుకురాలేదని బాలుడి హత్య - Sakshi

సిగరెట్లు తీసుకురాలేదని బాలుడి హత్య

సిగరెట్లు తీసుకొనిరావడానికి నిరాకరించాడనే కోపంతో ఇద్దరు యువకులు 13 ఏళ్ల బాలుడిని కిరాతంగా చంపారు.

నాసిక్: సిగరెట్లు తీసుకొనిరావడానికి నిరాకరించాడనే కోపంతో ఇద్దరు యువకులు 13 ఏళ్ల బాలుడిని కిరాతంగా చంపారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్లో ఈ ఘటన జరిగింది.

ప్లంబర్ శాలిగ్రామ్ ఫిర్యాదు మేరకు ఆయన కొడుకు గోలు అలియాస్ విశాల్ భలేరావు సిగరెట్లు తీసుకురానందుకు ఇటీవల ఇద్దరు యువకులు గొడవపడ్డారు. ఈ చిన్న కారణంతోనే నిందితులు కక్షకట్టి బాలుడ్ని హత్య చేశారు. అర్ధనగ్నంగా ఉన్న గోలు మృతదేహాన్ని ఆదివారం గుర్తించి పోస్ట్మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు.  కేసు దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టమ్ నివేదిక రావాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement