అగ్నిప్రమాదం :10 మంది కూలీలు మృతి | 10 killed in Jammu fire | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదం :10 మంది కూలీలు మృతి

Jan 1 2016 8:55 AM | Updated on Sep 3 2017 2:55 PM

అగ్నిప్రమాదం :10 మంది కూలీలు మృతి

అగ్నిప్రమాదం :10 మంది కూలీలు మృతి

జమ్మూ రాంబన్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి విషాదం చోటు చేసుకుంది.

జమ్మూ : జమ్మూ ప్రాంతంలోని రాంబన్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి విషాదం చోటు చేసుకుంది. స్థానిక చంద్రకోటి క్యాంప్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారని జిల్లా ఎస్పీ రణదీప్ కుమార్ శుక్రవారం జమ్మూలో వెల్లడించారు. మృతులంతా నిర్మాణ రంగంలో పని చేసే కూలీలని తెలిపారు. నిర్మాణ రంగంలో పని చేసేందుకు వారంతా పంజాబ్, హిమాచల్ ప్రదేశ్తోపాటు జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల నుంచి వచ్చి ఈ క్యాంప్లో ఉన్నారని పేర్కొన్నారు.

అయితే ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారని చెప్పారు. అగ్ని ప్రమాదం సంభవించండంతో ఊపిరాడక... కాలిన గాయలతో ఈ 10 మంది మరణించారని తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని రణదీప్ కుమార్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement