అలా మాట్లాడటం తప్పు

Zarina Wahab on Kangana Ranaut-Aditya Pancholi controversy - Sakshi

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ రూటే సపరేటు. ఏ విషయాన్ని అయినా ఆమె ధైర్యంగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంటారు. ఒక్కోసారి ఆమె మాటలు వివాదంతో పాటు చర్చకు దారితీస్తుంటాయి. తాజాగా.. ‘పదమూడేళ్ల క్రితం ఆదిత్య పంచోలీ మానసికంగా, లైంగికంగా నన్ను వేధించాడు’ అంటూ కంగన రనౌత్‌ గతంలో షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్‌ నటి, ఆదిత్య పంచోలీ భార్య జరీనా వాహబ్‌ స్పందించారు.

‘‘నా భర్త గురించి నాకు బాగా తెలుసు. నాకంటే బాగా ఎవ్వరికీ తెలీదు. ఆయన ఏ తప్పూ చేయలేదు. ఏ విషయమైనా నా వద్ద రహస్యంగా ఉంచేవారు కాదు. గతంలో ఆదిత్య, కంగన మధ్య ఏం జరిగిందో నాకు తెలుసు. అయినా వివాహం అయిన వ్యక్తితో ఏళ్ల తరబడి డేటింగ్‌ చేసి, తీరా విడిపోయిన తర్వాత అత్యాచారం చేశాడని ఆరోపిస్తే ఎలా? అది చాలా తప్పు’’ అంటూ మండిపడ్డారు. కాగా కంగన వ్యాఖ్యలపై ఆదిత్య పంచోలీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి  తెలిసిందే.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top