టార్గెట్‌ ఫిక్స్‌ చేసి... | yuddham saranam movie updates | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ ఫిక్స్‌ చేసి...

Jul 27 2017 11:17 PM | Updated on Sep 5 2017 5:01 PM

టార్గెట్‌ ఫిక్స్‌ చేసి...

టార్గెట్‌ ఫిక్స్‌ చేసి...

మంచికి మకిలి పట్టించేవాళ్లంటే ఆ కుర్రాడికి అసహ్యం.

మంచికి మకిలి పట్టించేవాళ్లంటే ఆ కుర్రాడికి అసహ్యం. ఆ మకిలిని కడిగిపారేయడం కోసం యుద్ధం చేయడానికి వెనకాడడు. టార్గెట్‌ ఫిక్స్‌ చేసి మరీ అసాంఘిక శక్తులను మట్టుబెడతాడు. నాగచైతన్య హీరోగా నటిస్తోన్న ‘యుద్ధం శరణం’లో తన క్యారెక్టర్‌ పై విధంగా ఉంటుందని సమాచారం. కృష్ణ ఆర్వీ మారిముత్తు దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ సినిమాకు లైన్‌ ప్రొడ్యూసర్‌. లావణ్యా త్రిపాఠి కథానాయిక.

ఈ చిత్రం టీజర్‌ను జూలై 31 సాయంత్రం విడుదల చేయనున్నారు. వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి మాట్లాడుతూ–  ‘‘ఇది ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. శ్రీకాంత్, రావు రమేశ్, మురళీశర్మ, రేవతి పాత్రలు సినిమాకు హైలైట్‌గా ఉంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: డేవిడ్‌ ఆర్‌. నాథన్, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: వివేక్‌ సాగర్, కెమెరా: నికేత్‌ బొమ్మి, సమర్పణ: సాయి శివాణి.

Advertisement
 
Advertisement
Advertisement