నిఖిల్ కోసం నిర్మాతల క్యూ | Young Hero Nikhil Future Projects | Sakshi
Sakshi News home page

నిఖిల్ కోసం నిర్మాతల క్యూ

Nov 28 2016 3:33 PM | Updated on Sep 4 2017 9:21 PM

నిఖిల్ కోసం నిర్మాతల క్యూ

నిఖిల్ కోసం నిర్మాతల క్యూ

జనాల చేతుల్లో డబ్బుల్లేని సమయంలో కూడా సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నిఖిల్కు ఇప్పుడు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

జనాల చేతుల్లో డబ్బుల్లేని సమయంలో కూడా సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నిఖిల్కు ఇప్పుడు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. శంకరాభరణం సినిమాతో కష్టాల్లో పడ్డ నిఖిల్.., ఎక్కడి పోతావు చిన్నవాడా సక్సెస్తో తిరిగి సూపర్ ఫాంలోకి వచ్చాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా నిఖిల్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు నిఖిల్.

అఖిల్ సినిమాతో నిర్మాతగా మారిన హీరో నితిన్ కూడ నిఖిల్ హీరోగా సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి నితిన్, నిఖిల్తో మాట్లాడాడని, త్వరలోనే ప్రకటన కూడా వెలువడనుందన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఇటీవలే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన అభిషేక్ ఫిలింస్ కూడా నిఖిల్ హీరోగా సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే నిఖిల్ మాత్రం వచ్చిన ప్రతీ సినిమా అంగీకరించకుండా చాలా జాగ్రత్తగా కథలు సెలెక్ట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement