‘యాత్ర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ ఫిక్స్‌! | Yatra Movie Pre Release Event On 1st February | Sakshi
Sakshi News home page

Jan 27 2019 12:31 PM | Updated on Jan 27 2019 12:33 PM

Yatra Movie Pre Release Event On 1st February - Sakshi

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఘట్టాన్ని సినిమాగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. యాత్రగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ మూవీలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన పోస్టర్స్‌, టీజర్‌, సాంగ్స్‌తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఫిబ్రవరి ఒకటో తేదీన హైద్రాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో ఈ ఈవెంట్‌ జరుగనున్నట్లు నిర్మాతలు తెలిపారు. శివ మేక సమర్పణలో విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహి వి. రాఘవ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 8న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement