
కన్నడ పరిశ్రమలో ఇప్పటివరకు సాధ్యంకాని ఫీట్‌ను యువ సంచలనం యశ్ సాధించబోతున్నాడు. కె.జి.యఫ్‌తో అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా దూసుకుపోతున్నాడు. మాస్‌ను కట్టిపడే అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఈ చిత్రాన్ని తమిళ, హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ చేశారు. బాలీవుడ్‌లో జీరో సినిమా నిరాశపరచగా.. కె.జి.యఫ్ వసూళ్లలో దుమ్ముదులుపుతోంది. ఇక ఈ సినిమా వారాంతానికి వంద కోట్ల క్లబ్‌లో చేరనుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాతో యశ్.. కన్నడ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ హీరోకు సాధ్యం కాని అరుదైన ఫీట్‌ను సాధించనున్నాడు. వంద కోట్లను కొల్లగొట్టిన హీరోగా రికార్డులను క్రియేట్‌చేయనున్నాడు. ఈ సక్సెస్‌ను ఎంజాయ్‌చేస్తున్న వారాహి చిత్రయూనిట్ డిసెంబర్ 26న తిరుపతి, వైజాగ్, విజయవాడలో అభిమానులను కలిసి సందడి చేయనుంది.