
తనను ట్రోల్ చేసిన వ్యక్తికి హీరోయిన్ యామి గౌతం కౌంటర్ ఇచ్చారు. తన స్థానికతను ప్రశ్నించిన అతడికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే.... హిమాచల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2019 కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యామి గౌతంను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఆమె స్థానికతను ప్రస్తావిస్తూ రియాలిటీ షో బిగ్‌బాస్ హౌజ్‌లో యామి తాను చండీగఢ్ అమ్మాయిని అన్న వ్యాఖ్యలను ఉటంకిస్తూ ట్రోల్ చేశాడు. ‘హిమాచల్ ప్రభుత్వమేమో యామిని తమ రాయబారిగా పెట్టుకుంది. కానీ ఆమె మాత్రం నేను చండీగఢ్‌కు చెందిన వ్యక్తిని అని చెప్పుకొంటుంది. ఇదేం విచిత్రం అంటూ ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
ఈ విషయంపై స్పందించిన యామి... ‘ నా జన్మభూమి దేవనగరి హిమాచల్. పెరిగిందేమో చండీగఢ్. అదే విధంగా నా కర్మభూమి(పనిచేసే చోటు) ముంబై. నేను మానసికంగా బలవంతురాలిని. ఇలాంటి మాటలు నా మీద ప్రభావం చూపలేవు. మీరేం బాధపడకండి. అలాగే ఒత్తిడికి లోనవ్వకండి. సరేనా’ అంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా విక్కీ డోనర్ సినిమాలో ఆయుష్మాన్ ఖురానాతో జోడీ కట్టిన యామి.. ప్రస్తుతం అతడితో కలిసి నటించిన బాలా చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తోంది. బట్టతల ఉన్న వ్యక్తి కష్టాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 8న రిలీజ్ కానుంది.
मेरी जन्म-भूमि हिमाचल ..करम-भूमि मुम्बईं ...परवरिष चनडीगड़ की है | शब्दों से ज़्यादा मज़बूत सोच और कार्य पर विश्वास रखती हूँ । तुहाँ निश्चिंत रेहा, मैं आयादि :) https://t.co/xx5eLU3FAJ
— Yami Gautam (@yamigautam) November 4, 2019