హాలీవుడ్ సినిమా ట్రైలర్‌లా ఉంది - హీరో నాని | "Yamapasam" Movie Audio Launch | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ సినిమా ట్రైలర్‌లా ఉంది - హీరో నాని

Feb 14 2016 11:02 PM | Updated on Sep 3 2017 5:39 PM

హాలీవుడ్  సినిమా ట్రైలర్‌లా ఉంది - హీరో నాని

హాలీవుడ్ సినిమా ట్రైలర్‌లా ఉంది - హీరో నాని

‘‘ప్రచార చిత్రం కొత్తగా ఉంది. ఏదో హాలీవుడ్ సినిమా ట్రైలర్‌లా ఉంది. సినిమా ఎప్పుడు చూస్తానా?

‘‘ప్రచార చిత్రం కొత్తగా ఉంది. ఏదో హాలీవుడ్ సినిమా ట్రైలర్‌లా ఉంది. సినిమా ఎప్పుడు చూస్తానా? అనిపిస్తోంది. రవి తెలుగులో ఎప్పుడో రావాల్సింది. లేట్‌గా అయినా లేటెస్ట్‌గా వచ్చాడు’’ అని హీరో నాని అన్నారు. ‘జయం’ రవి, లక్ష్మీ మీనన్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘మిరుథన్’. శక్తి సౌంద ర్‌రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘యమపాశం’ పేరుతో  ఈ నెల 19న తెలుగులో విడుదల కానుంది. డి.ఇమాన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను నాని విడుదల చేశారు.  ‘‘నా కెరీర్‌లో  తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన తొలి చిత్రమిది’’ అని ‘జయం’ రవి అన్నారు. దర్శకుడు ‘జయం’ రాజా, నిర్మాతలు ఎడిటర్ మోహన్ , జ్ఞాన్‌వేల్ రాజా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement