breaking news
Hero Nani
-
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో నాని మూవీ షూటింగ్
Nani-Keerthi Suresh Song Shoot At Godavarikhani: నాని హీరోగా నటిస్తున్న ఫుల్ మాస్, యాక్షన్ ప్యాక్డ్ చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జరుగుతోంది. నాని, కీర్తిలపై పాటని చిత్రీకరిస్తున్నారు. చదవండి: స్టార్ హీరో అయ్యుండి ఇలా చేస్తారనుకోలేదు: విజయ్‌పై పూజా కామెంట్స్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ‘నాటు నాటు..’ పాటకి కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకు నృత్యరీతులు సమకూరుస్తున్నారు. నాని, కీర్తి, 500 మంది డ్యాన్సర్లతో ఈ పాట షూటింగ్ జరుగుతోంది. ‘‘మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గా ‘దసరా’ రూపొందుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న నాని తొలి పాన్ ఇండియా చిత్రం ఇది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్, సంగీతం: సంతోష్ నారాయణన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ చాగంటి. -
హాలీవుడ్ సినిమా ట్రైలర్‌లా ఉంది - హీరో నాని
‘‘ప్రచార చిత్రం కొత్తగా ఉంది. ఏదో హాలీవుడ్ సినిమా ట్రైలర్‌లా ఉంది. సినిమా ఎప్పుడు చూస్తానా? అనిపిస్తోంది. రవి తెలుగులో ఎప్పుడో రావాల్సింది. లేట్‌గా అయినా లేటెస్ట్గా వచ్చాడు’’ అని హీరో నాని అన్నారు. ‘జయం’ రవి, లక్ష్మీ మీనన్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘మిరుథన్’. శక్తి సౌంద ర్రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘యమపాశం’ పేరుతో ఈ నెల 19న తెలుగులో విడుదల కానుంది. డి.ఇమాన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను నాని విడుదల చేశారు. ‘‘నా కెరీర్లో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన తొలి చిత్రమిది’’ అని ‘జయం’ రవి అన్నారు. దర్శకుడు ‘జయం’ రాజా, నిర్మాతలు ఎడిటర్ మోహన్ , జ్ఞాన్వేల్ రాజా పాల్గొన్నారు.