100 డేస్‌... 5 లుక్స్‌

wrap for Salman Khan starrer Bharat - Sakshi

పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఓ జంట. అంతలోనే భర్తకు ఆర్మీ నుంచి పిలుపొచ్చింది. దేశ సేవ కోసం వెంటనే సరిహద్దు దిశకు ప్రయాణం మొదలు పెట్టే సమయం ఆసన్నం అవుతుంది. అప్పుడు ఆ దంపతులు ఎలా ఎమోషనల్‌గా ఫీలయ్యారు? అనే దృశ్యాలను వెండితెరపై చూడాలంటే ‘భారత్‌’ సినిమా  చూడాల్సిందే. సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్‌ హీరో హీరోయిన్లుగా ఈ చిత్రం రూపొందుతోంది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిశా పాట్నీ, టబు కీలక పాత్రలు చేస్తున్నారు.

శనివారంతో ఈ సినిమా షూటింగ్‌ వంద రోజులకు చేరుకుంది. ఇంతటితో ప్యాచ్‌ వర్క్‌ మినహా ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. చివరిగా ముంబైలో సల్మాన్, కత్రినాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. మాల్తా, అబుదాబి, లూధియానా, ఢిల్లీ ప్రాంతాల్లో షూటింగ్‌ జరిగింది. ఈ సినిమాలో సల్మాన్‌ ఐదు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తారు. 1947 నుంచి 2000 కాలపరిణామ నేపథ్యంలో ఈ సినిమా స్రీన్‌ప్లే ఉంటుంది. 2014లో వచ్చిన కొరియన్‌ హిట్‌ మూవీ ‘యాన్‌ ఓడ్‌ టు మై ఫాదర్‌’కి ‘భారత్‌’ హిందీ రీమేక్‌. ఈ సినిమాను ఈ ఏడాది రంజాన్‌కి విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top