నా జీతం ఎంతైతే మీకెందుకు..? | Why so much interest in my salary, asks Salman Khan | Sakshi
Sakshi News home page

నా జీతం ఎంతైతే మీకెందుకు..?

Oct 3 2015 11:39 AM | Updated on Jul 18 2019 1:41 PM

నా జీతం ఎంతైతే మీకెందుకు..? - Sakshi

నా జీతం ఎంతైతే మీకెందుకు..?

మీడియాతో ఎప్పుడు మాట్లాడినా సరదాగా ఎంటర్టైన్ చేసే సల్మాన్ ఖాన్ ఈ సారి కాస్త వేడి పెంచాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియా మీద సెటైర్స్ వేస్తూ అలరించాడు.

మీడియాతో ఎప్పుడు మాట్లాడినా సరదాగా ఎంటర్టైన్ చేసే సల్మాన్ ఖాన్ ఈ సారి కాస్త వేడి పెంచాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియా మీద సెటైర్లు వేస్తూ అలరించాడు. ప్రస్తుతం తన హీరోగా నటించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమాతో పాటు తను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'బిగ్ బాస్ 9' ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు సల్మాన్.

వరుస ప్రమోషన్ ఈవెంట్లతో రెగ్యులర్ గా మీడియాతో కలుస్తున్న సల్మాన్ ఇటీవల ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'మీ జీతాల విషయంలో నాకు ఎలాంటి ఆసక్తి లేదు.. మరి మీకు మాత్రం నా జీతం విషయంలో అంత ఇంట్రస్ట్ ఎందుకు' అంటూ చురకలంటించాడు.'నా రెమ్యూనరేషన్ పెరిగినా అది నాతో ఉండదు బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ కే వెళ్తుంది. ఓ మంచి పని కోసం ఉపయోగపడుతుంది' అని వివరించాడు.

బాలీవుడ్లో బ్యాడ్బాయ్ ఇమేజ్ ఉన్న సల్మాన్ 2007లో కొన్ని ఇతర సంస్థలతో కలిసి బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్న ఎంతో మందికి విద్యా, వైద్య సేవలు అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement