350కోట్లు ఇస్తారట! | When is Prabhas new movie 'Soho'? | Sakshi
Sakshi News home page

350కోట్లు ఇస్తారట!

May 21 2017 12:12 AM | Updated on Sep 5 2017 11:36 AM

350కోట్లు ఇస్తారట!

350కోట్లు ఇస్తారట!

బడా బడా బాలీవుడ్‌ బాబులందరూ కర్చీఫ్‌లు రెడీ చేస్తున్నారు. ప్రభాస్‌ కొత్త సినిమా ‘సాహో’ ఎప్పుడు వస్తుందా? కర్చీఫ్‌ వేసి తీసుకువెళ్దామని!

బడా బడా బాలీవుడ్‌ బాబులందరూ కర్చీఫ్‌లు రెడీ చేస్తున్నారు. ప్రభాస్‌ కొత్త సినిమా ‘సాహో’ ఎప్పుడు వస్తుందా? కర్చీఫ్‌ వేసి తీసుకువెళ్దామని! ‘బాహుబలి’ మేనియా అటువంటిది మరి. ఆల్రెడీ 1500 కోట్లు కలెక్ట్‌ చేసిన ‘బాహుబలి’ థియేటర్లలో ఇంకా ఇరగదీసేస్తోంది. దీని తర్వాత సినిమా ‘సాహో’ను అంతే రేంజ్‌లో భారీగా తీయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ సంస్థ సుమారు రూ. 150 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నారట! సాంపిల్‌గా రిలీజ్‌ చేసిన టీజర్‌ సినిమా ఎలా ఉంటుందనే దానిపై క్లారిటీ ఇచ్చింది.

టీజర్‌ ఎండింగ్‌లో స్టంట్స్‌ హాలీవుడ్‌ సై్టల్‌లో ఉన్నాయి. పైగా... తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తీయనున్న సినిమా కావడంతో థియేట్రికల్‌ రైట్స్‌ కోసం ఇప్పట్నుంచీ కాంపిటీషన్‌ మొదలైంది. ప్రముఖ హిందీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఈరోస్‌ ‘సాహో’ నాలుగు భాషల్లో డిస్ట్రిబ్యూషన్‌ హక్కులకు రూ. 350 కోట్లు ఆఫర్‌ చేసిందట. ఇంకా డీల్‌ ఫైనలైజ్‌ కాలేదని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈ డీల్‌ క్లోజ్‌ కాకముందు మరొకరు ఎవరైనా ఇంకా ఎక్కువ ఆఫర్‌ చేస్తారో! లేదా ఇదే ఫైనలైజ్‌ అవుతుందో! త్వరలో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement