ముగ్గురు లెంజడరీ హీరోలు కలిసి పాడిన వేళ! | When Amitabh Bachchan Sang With, Raj, Shashi Kapoor | Sakshi
Sakshi News home page

ముగ్గురు లెంజడరీ హీరోలు కలిసి పాడిన వేళ!

Dec 29 2015 9:57 PM | Updated on Apr 3 2019 6:23 PM

బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్ ఓ అరుదైన ఫొటోను ట్విట్టర్‌లో తన అభిమానులతో పంచుకున్నారు.

ముంబై: బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్ ఓ అరుదైన ఫొటోను ట్విట్టర్‌లో తన అభిమానులతో పంచుకున్నారు. లెంజడరీ హీరోలు రాజ్‌కపూర్, శశికపూర్‌తో కలిసి తాను పాట పాడుతున్న ఫొటో అది. అలానాటి మధురజ్ఞాపకమది. 'అప్పట్లో సోవియట్ రష్యాలో ఉన్న తాష్కెంట్‌లో రాజ్‌కపూర్‌ జీ, శశికపూర్‌జీతో కలిసి 'సారే జహా సే అచ్చా' అనే పాట పాడాను' అంటూ ఆ జ్ఞాపకాన్ని బిగ్‌ బీ నెమరువేసుకున్నారు.

ఈ ఏడాది 'పీకూ' సినిమాతో ఘనవిజయం సాధించిన అమితాబ్‌ బచ్చన్‌ త్వరలోనే 'వజీర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'వజీర్'లో ఫర్హాన్ అఖ్తర్‌, అదితిరావు హైదరీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement