మళ్లీ మలైకా మాయాజాలం | What's your verdict on Malaika Arora Khan's “Fashion khatm mujhpe”? | Sakshi
Sakshi News home page

మళ్లీ మలైకా మాయాజాలం

Dec 25 2014 11:30 PM | Updated on Sep 2 2017 6:44 PM

మళ్లీ మలైకా మాయాజాలం

మళ్లీ మలైకా మాయాజాలం

దేశం మొత్తాన్నీ తన ఆటతో, అందుకు తోడైన పాటతో ఉర్రూతలూపిన మలైకా అరోరా ఖాన్

దేశం మొత్తాన్నీ తన ఆటతో, అందుకు తోడైన పాటతో ఉర్రూతలూపిన మలైకా అరోరా ఖాన్ ఇప్పుడు మరోసారి తన మాయాజాలం చూపనున్నారు. గతంలో ‘మున్నీ బద్‌నామ్ హుయీ...’ పాటతో అన్ని రికార్డులూ బద్దలుకొట్టిన ఈ అమ్మడు తాజాగా ‘ఫ్యాషన్ ఖతమ్ ముఝ్‌పే...’ అనే పాటలో తన ఒయ్యారాలు ఒలకబోస్తున్నారు. రాజ్‌కుమార్ రావ్, సోనమ్ కపూర్‌లు సైతం ఆ పాటలో కనిపించనున్నారు. సాజిద్ - వాజిద్‌లు సంగీతం కూర్చగా, మమతా శర్మ పాడిన ఈ ప్రత్యేక నృత్యగీతం ‘డాలీ కీ డోలీ’ చిత్రంలో ప్రేక్షకులను అలరించనుంది.
 
 పెళ్ళినాటి రాత్రే అబ్బాయిలను మోసం చేసి, దోచుకొనే ఒక మోసగత్తె పాత్ర చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. అర్బాజ్ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ డోగ్రా దర్శకుడు. ఇది ఇలా ఉండగా, ఈ ప్రత్యేక నృత్యగీతం ద్వారా ‘బాలీవుడ్ మున్నీ’ మలైకా అరోరా మరోసారి మంత్రముగ్ధుల్ని చేస్తుందని దర్శక, నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. మరి, మలైకా అందచందాలు, ఆటపాటలు చూడడానికి ఆసక్తిగా ఎదురుచూడాల్సిందే!
 

Advertisement
 
Advertisement
Advertisement