‘హాలో’ టీజర్‌: ఏ కారణం లేకుండా రచ్చ చేస్తున్నారు : అఖిల్ 

What havoc for no reason, tweets akhil - Sakshi

కాపీరైట్‌ ఆరోపణలతో ‘హాలో’ సినిమా టీజర్‌ను యూట్యూబ్‌ తొలగించిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై హీరో అఖిల్‌ స్పందించారు. ‘హాలో’  మూవీ టీజర్‌కు సోషల్‌ మీడియాలో 80లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. మా టీజర్‌పై వచ్చిన తప్పుడు కాపీరైట్‌ క్లయిమ్‌పై నిర్మాతలుగా మేం స్పందించాల్సిన అవసరముంది. అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌  కోసం రియల్లీ స్లోమోషన్‌తో కొలబారేట్‌ అయినందుకు మేం గర్వపడుతున్నాం. ఏ కారణం లేకుండా ఈ విషయంలో రచ్చ చేస్తున్నారు’ అని అఖిల్‌ ట్వీట్‌ చేశారు. 

అఖిల్ అక్కినేని నటించిన రెండో చిత్రం ‘హలో’ .. ఇటీవల విడుదలైన ఈ టీజర్‌ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. టీజర్‌ వచ్చిన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అఖిల్ షేర్ చేసిన యూట్యూబ్ అకౌంట్‌ నుండి ఈ టీజర్‌ని కాపీరైట్ క్రింద యూట్యూబ్‌ తొలగించింది. కాపీరైట్ నోటీసు అందడంతో యూట్యూబ్‌ ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ను కాపీ చేయడం వల్లే.. యూట్యూబ్‌ టీజర్‌ను తొలగించిందని, మ్యూజిక్‌ కాపీ చేస్తే యూట్యూబ్‌ నుంచి చర్యలు తప్పవని టాలీవుడ్‌లో వినిపిస్తోంది. అయితే, ఈ వివాదానికి తెరదించుతూ యూట్యూబ్‌ హాలో మూవీ టీజర్‌ను మళ్లీ సైట్‌లో రీస్టోర్‌ చేసింది. మరోవైపు ఈ ఆరోపణల్ని కొట్టిపారేస్తూ.. ఏ కారణం లేకుండా రచ్చ చేస్తున్నారని అఖిల్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top