నమ్మకం లేదంటూనే..

We're together, says Lekha - Sakshi

తమిళసినిమా: కొందరు సినిమా నటీమణులతో ఇతరులు కూడా పెళ్లిపై నమ్మకం లేదనడం ఒక ఫ్యాషన్‌ అయిపోయింది. అయినా ప్రేమలో పడుతుంటారు. సహజీవనం చేస్తుంటారు. పెళ్లి మాత్రం చేసుకోనంటారు. అలాంటి వారిలో నటి లేఖా వాషింగ్టన్‌ ఒకరు. ఉన్నాలే ఉన్నాలే, జయం కొండాన్, వా, కల్యాణ సమయల్‌ సాదం చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించింది. ఇటీవల నటనకు దూరం అయిన లేఖా వాషింగ్టన్‌ తనకు పెళ్లిపై నమ్మకం లేదని బహిరంగంగానే చెప్పింది.

అలాంటిది ముంబైకి చెందిన బబ్లో చటర్జీ అనే వ్యక్తి ప్రేమలో పడింది. ఎనిమిదేళ్లుగా ఆయనతో డేటిం గ్‌ చేస్తున్న లేఖా వాషింగ్టన్‌ ఐదేళ్లుగా తన బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రేమజంట పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. పెళ్లిపైనే నమ్మకం లేదన్న లేఖా వాషింగ్టన్‌ ఇప్పుడు ప్రేమించినోడినే మనువాడబోతోంది. ఈ సుదీర్ఘ సహజీవన జంట ఈ నెల 18న ముంబైలో పెళ్లి చేసుకోనున్నారన్నది తాజా సమాచారం. చాలా నిరాడంబరంగా జరగనున్న ఈ పెళ్లిలో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో పాటు నటుడు సిద్ధార్థ్, మాధవన్‌ చాలా కొద్దిమంది నటీనటులు మాత్రమే పాల్గొననున్నారట.

Back to Top