ప్రపంచంలో మేమే చెత్త డ్యాన్సర్లం | we are the wrost best dancers in the world : Sharukh Khan | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో మేమే చెత్త డ్యాన్సర్లం

Oct 14 2015 11:00 AM | Updated on Sep 3 2017 10:57 AM

ప్రపంచంలో మేమే చెత్త డ్యాన్సర్లం

ప్రపంచంలో మేమే చెత్త డ్యాన్సర్లం

ఐదేళ్ల విరామం తరువాత 'దిల్వాలే' సినిమా కోసం మరోసారి కలిసి నటిస్తున్నారు బాలీవుడ్ హాట్ పెయిర్ షారూఖ్, కాజోల్. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, బాజీగర్, కభీ కుషి కభీగమ్ లాంటి...

ఐదేళ్ల విరామం తరువాత 'దిల్వాలే' సినిమా కోసం మరోసారి కలిసి నటిస్తున్నారు బాలీవుడ్ హాట్ పెయిర్ షారూఖ్, కాజోల్. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, బాజీగర్, కభీ కుషి కభీ గమ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ జోడీ చివరగా మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాలో కలిసి కనిపించింది.

తాజాగా దిల్వాలే సినిమా కోసం కాజోల్తో కలిసి ఓ సాంగ్ షూట్ లో పాల్గొంటున్న షారూఖ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. ' నాకు పనిచేయటం కంటే ఇష్టమైన పని ఇంకొంకటి లేదు. అది కూడా కాజోల్ తో డ్యాన్స్ చేయటం అయితే ఇంకా ఇష్టం. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలోనే చెత్త డ్యాన్సర్లం మేమే' అంటూ ట్వీట్ చేశాడు షారూఖ్ ఖాన్.

షారూక్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్న దిల్వాలే సినిమాకు రోహిత్ శెట్టి దర్శకుడు. కాజోల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్, కృతిసనన్ లు ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 18న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement