భయంకరమైన పేలుళ్లు...నేను క్షేమమే | we are safe but feel terrible says jenelia desmukh | Sakshi
Sakshi News home page

భయంకరమైన పేలుళ్లు...నేను క్షేమమే

Aug 18 2015 11:16 AM | Updated on Sep 3 2017 7:40 AM

భయంకరమైన పేలుళ్లు...నేను క్షేమమే

భయంకరమైన పేలుళ్లు...నేను క్షేమమే

నరమేధం సృష్టించిన బ్యాంకాక్ పేలుళ్ల సమయంలో బాలీవుడ్ హీరోయిన్ జెనీలియా దేశ్ముఖ్ అక్కడికి సమీపంలోనే ఉన్నదట.

బ్యాంకాక్‌: నరమేధం సృష్టించిన బ్యాంకాక్ పేలుళ్ల సమయంలో  బాలీవుడ్ హీరోయిన్ జెనీలియా దేశ్ముఖ్  అక్కడికి సమీపంలోనే ఉన్నదట. ఈ భయంకరమైన పేలుడు జరిగినప్పుడు ఆమె ఆ ప్రదేశానికి  ఎదురుగా ఉన్న ఒక మాల్‌లో ఉన్నారట. ఈ విషయాన్ని జెనీలియా స్వయంగా ట్వీట్ చేసింది.  ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లినట్లు జెన్నీ తెలిపింది. అయితే తాను  సురక్షితంగానే ఉన్నట్లు ఆమె ట్విట్టర్‌లో పేర్కొంది.  సైరన్ల మోతలు, మంటలు చూసి తనకు చాలా భయమేసిందని, అంతమంది చనిపోవడం విచారకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలలో తన విలక్షణ నటనతో ఆకట్టుకున్న జెనిలీయా....బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్ ముఖ్ను పెళ్లాడింది.  తమిళ, తెలుగు, హిందీ తదితర భాషలలో హీరోయిన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.   హీరోయిన్ గా మంచి స్వింగ్ లో  ఉండగానే   రితేష్ దేశ్ ముఖ్‌ను ప్రేమించి 2012లో పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో చాలాకాలం నటనకు దూరంగా ఉన్న జెనిలీయా ... ఇటీవలే సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆల్‌రెడీ రెండు కమర్శియల్ ప్రకటనల్లో నటించిన జెనీలియా ఇప్పుడు ఒక హిందీ చిత్రానికి సైన్ చేసినట్లు సమాచారం. 


థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లోని ప్రఖ్యాత బ్రహ్మ దేవాలయం ప్రాంగణంలో సోమవారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 27 మంది మరణించారు. వీరిలో నలుగురు విదేశీయులు కూడా ఉన్నారు. 117 మంది గాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement