హీరోయినా? హెడ్‌ మాస్టారా? అన్ని క్వశ్చన్స్‌ ఏంట్రా బాబు! | Vunnadi Okate Zindagi Movie Trailer released | Sakshi
Sakshi News home page

హీరోయినా? హెడ్‌ మాస్టారా? అన్ని క్వశ్చన్స్‌ ఏంట్రా బాబు!

Oct 15 2017 12:55 AM | Updated on Oct 15 2017 3:27 AM

Vunnadi Okate Zindagi Movie Trailer released

‘నీ ఫ్రెండ్స్‌ దగ్గర నీకు నచ్చని విషయం ఏంటి?’– రామ్‌ని అనుపమ అడిగింది. వెంటనే ఆన్సర్‌ చెప్పాడు. ‘మరి, నచ్చింది?’– నెక్ట్స్‌ క్వశ్చన్‌! మళ్లీ ఆన్సర్‌ చెప్పాడు. ‘ఫ్రెండ్‌కి, బెస్ట్‌ ఫ్రెండ్‌కి తేడా ఏంటి?’– వన్‌ మోర్‌ క్వశ్చన్‌! ఈసారీ ఆన్సర్‌ చెప్పాడు. ‘మరి, బెస్ట్‌ ఫ్రెండ్‌కి, లవర్‌కి?’– మళ్లీ ఇంకో క్వశ్చన్, ఆన్సర్‌ కామన్‌! అక్కడితో అనుపమ ఆగలేదు. ‘అయ్య బాబోయ్‌... అనుపమా పరమేశ్వరన్‌ హీరోయినా? హెడ్‌ మాస్టారా? అన్ని క్వశ్చన్స్‌ ఏంట్రా బాబు’ అని అబ్బాయిలంతా అనుకునేలా ఇంకొక క్వశ్చన్‌ ‘నిన్నెవరైనా లవ్‌ చేస్తే... తన దగ్గర్నుంచి నువ్వు ఎక్స్‌పెక్ట్‌ చేసేదేంటి?’ అని అడిగింది! అప్పటివరకూ కూల్‌ ఆన్సర్స్‌ ఇచ్చిన రామ్, ఈసారి చిన్న ఝలక్‌ ఇచ్చాడు. ‘ఏడవడం’ అని చెప్పాడు.

లవ్‌ చేసిన అమ్మాయిని ఏడిపించాలని ఎవరైనా అనుకుంటారా? కానీ, రామ్‌ ఫీలింగ్‌ మాత్రం అదే! అప్పుడు అనుపమ ఏం అడిగిందో తెలుసా? ‘నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా?’ అని! ‘మనకింకా ఆ అదృష్టం కలగలేదు’ అని రామ్‌ చెప్పగానే... ‘డోంట్‌ వర్రీ. తొందరలోనే ఏడుస్తావ్‌!’ అని అనుపమ రిప్లై ఇచ్చింది. ఓహ్‌... లవ్‌ని ఇలా కూడా ఎక్స్‌ప్రెస్‌ చేయొచ్చా? అనుకున్నారు ఆడియన్స్‌! ఇదంతా ‘ఉన్నది ఒకటే జిందగీ’ ట్రైలర్‌లో మేటర్‌. సిన్మా కాన్సెప్ట్‌ కన్వే చేసేలా ట్రైలర్‌ కట్‌ చేశారు. అందులో డైలాగ్స్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటు న్నాయి. రామ్, అనుపమ, లావణ్యా త్రిపాఠి ముఖ్య తారలుగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్‌ కానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరచచిన పాటల్ని, ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేశారు. ‘‘సినిమా ఇండస్ట్రీకి ఎందుకొచ్చానో ఈ సినిమాతో అర్థమైంది’’ అన్నారు రామ్‌. ‘‘దర్శకుడు కిశోర్‌ తిరుమల సినిమా కోసం ఏం చేసినా తన గుండె లోతుల నుంచే చేస్తాడు’’ అన్నారు ‘స్రవంతి’ రవికిశోర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement