
కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్‌నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘జిగ్రీస్’. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించారు. కృష్ణ వోడపల్లి నిర్మాతగా వ్యవహరించాడు. ఇటీవల ఈ మూవీ టీజర్‌ని స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేయగా..ప్రేక్షకుల నుంచి మంచి స్పందల లభించింది. ఫ్రెండ్షిప్, అడ్వెంచర్, కామెడీ నేపథ్యంలో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా తొలి పాటని యంగ్ హీరో కిరణ్ అబ్బవరం విడుదల చేశాడు.
అనంతరం కిరణ్ మాట్లాడుతూ..‘ఈ పాట చాలా ఎనర్జీటిక్‌గా ఉంది. కమ్రాన్ సయ్యద్ ఇచ్చిన ట్యూన్ చాలా ఫ్రెష్‌గా ఉంది, లిరిక్స్ చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. టీజర్ నేను ముందే చూశాను, చాలా బాగా నచ్చింది. నేను కూడా ఒకప్పుడు కొత్తవాడినే, అందుకే కొత్త వాళ్లంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. జిగ్రీస్ టీమ్ చాలా ప్యాషన్‌తో పనిచేశారు. ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా’ అన్నారు.బిగ్ ఫిష్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.