దానికి వెరీ వెరీ సారీ

Vishwak Sen Emotional Press Meet About Falaknuma Das Controversy - Sakshi

– విశ్వక్‌ సేన్‌

‘‘ఐదు కోట్లు ఖర్చు పెట్టుకుని నేను ఓ కమర్షియల్‌ సినిమా చేసుకోవచ్చు. కానీ, చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్‌కు నా సినిమా ఒక మంచి లాంచింగ్‌ ప్యాడ్‌లా ఉండాలని 80 మంది కొత్తవాళ్లను పెట్టి, రెండేళ్లు కష్టపడి  ‘ఫలక్‌నుమా దాస్‌’ సినిమా తీశాం. మా సినిమాపై నెగటివిటీని ప్రచారం చేయడానికి ఓ గ్రూప్‌ తయారైంది’’ అన్నారు విశ్వక్‌ సేన్‌. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్‌’. డి.సురేశ్‌బాబు సమర్పణలో కరాటే రాజు నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది.

తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో విశ్వక్‌ సేన్‌ పోస్ట్‌ చేసిన వీడియోపై, విజయవాడ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన అంశాలపై దుమారం రేగింది. దీనిపై విశ్వక్‌ సేన్‌ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నేను ఏ రివ్యూ రైటర్‌ని కానీ మీడియాను కానీ ఏ హీరోనీ కూడా ఏమీ అనలేదు. కానీ కొందరు పని గట్టుకుని మా సినిమాపై నెగటివ్‌ పబ్లిసిటీ చేస్తున్నారు. ఎంతో ఖర్చు పెట్టి వేసిన పోస్టర్స్‌ను కొందరు చించేయడం బాధ అనిపించింది నేను డబ్బులు ఎక్కువై సినిమా చేయలేదు. అందరి డబ్బూ తిరిగి ఇవ్వాలనే బాధ్యత నాకుంది.

ఎవరినో ఏదో అనేసి పబ్లిసిటీ తెచ్చుకుందామనే చీప్‌ మెంటాలిటీ నాకు లేదు. నా సినిమాకు పదికోట్లు నష్టం వస్తుందని తెలిసినప్పుడు కంట్రోల్‌ తప్పి, ఒక మాట అన్నాను. దానికి వెరీ వెరీ సారీ! విజయవాడలో నేను మాట్లాడిన ఫుల్‌ వీడియో చూపకుండా, కట్‌ చేసి చూపిస్తున్నారు. అసలు నేను ప్రేక్షకులను ఎందుకు తిడతాను? ఆదివారం సెకండ్‌ షో కాకుండా 4.80 కోట్ల రూపాయల గ్రాస్‌ను మా సినిమా కలెక్ట్‌ చేసింది. ఈ వీక్‌లో విడుదలైన సినిమాలన్నింటిలో మాదే హయ్యస్ట్‌ గ్రాసర్‌. నేను ఎవరినీ హర్ట్‌ చేయలేదు.. ఎవరికీ సవాల్‌ విసరలేదు. ఎవరి ఫ్యాన్స్‌నూ ఏమీ అనలేదు. నాకు అన్నం పెట్టేదే సినిమా. అలాంటిది రివ్యూ రైటర్స్‌ను నేను ఎందుకు విమర్శిస్తాను. నిజంగా నేను వాళ్లని అన్నట్లు నిరూపిస్తే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతాను. రేటింగ్స్‌ని పక్కన పెడితే మా సినిమాను ప్రేక్షకులు బతికిస్తున్నారు’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top