మార్కెట్‌లో వార్! | Vishal's 'Marudhu' set for massive release | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో వార్!

May 22 2016 11:31 PM | Updated on Sep 17 2018 5:10 PM

మార్కెట్‌లో వార్! - Sakshi

మార్కెట్‌లో వార్!

అతను మార్కెట్‌లో సరుకులు లోడ్ చేసే సాధారణ వ్యక్తి. మార్కెట్‌ను తన గుప్పెట్లో పెట్టుకుని శాసించాలనుకుని ఓ రాజకీయ నాయకుడు ప్రయత్నాలు చేస్తుంటాడు.

అతను మార్కెట్‌లో సరుకులు లోడ్ చేసే సాధారణ వ్యక్తి. మార్కెట్‌ను తన గుప్పెట్లో పెట్టుకుని శాసించాలనుకుని ఓ రాజకీయ నాయకుడు ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ ప్రయత్నాలను హీరో ఎలా అడ్డుకున్నాడు? వారిద్దరి మధ్య జరిగే యుద్ధం ఎలా ఉంటుంది? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మరుదు’. విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో ఇటీవల విడుదలై, మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రాన్ని ‘రాయుడు’ పేరుతో హరి వెంకటేశ్వర పిక్చర్స్ అధినేత జి.హరి తెలుగులో ఈ నెల 27న విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ- ‘‘తమిళంలో విశాల్ కెరీర్‌లో భారీ ఓపెనింగ్స్ రాబట్టడంతో పాటు సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళ వెర్షన్‌లో మధురై బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. తెలుగుకి అనుగుణంగా అనంతపురం రాప్తాడు గ్రామం నేపథ్యంలో జరిగేలా తీర్చిదిద్దాం. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement