నవంబర్‌లో స్పెషల్‌ డిటెక్టివ్‌! | Vishal's Detective Releases on November 10th | Sakshi
Sakshi News home page

నవంబర్‌లో స్పెషల్‌ డిటెక్టివ్‌!

Oct 30 2017 12:40 AM | Updated on Oct 30 2017 12:40 AM

Vishal's Detective Releases on November 10th

‘మీ ఫీజెంత?’ అడుగుతాడు డిటెక్టివ్‌ని ఓ వ్యక్తి. కేసు తెలిస్తే కానీ ఫీజుకు కమిట్‌ అవ్వనంటాడు. అతను స్పెషల్‌ డిటెక్ట్‌వ్‌. కేసులో క్లూస్‌ వాటంతట అవే దొరకాలని చూడడు. దొరికేవరకు వెతుకుతాడు. వన్స్‌ కమిట్‌ అయితే ఆ కేసుని సక్సెస్‌ఫుల్‌గా ముగించాల్సిందే. పోలీసులు కూడా అప్పుడప్పుడు అతని హెల్ప్‌ తీసుకుంటుంటారు. అయితే ఇలాంటి స్పెషల్‌ డిటెక్టివ్‌కు ఓ మర్డర్‌ మిస్టరీ సవాల్‌లా నిలిచింది. ఆ మిస్టరీని ఆ ఎలా చేధించాడు? ఈ క్రమంలో అతనిపై ఎవరైనా ఎటాక్‌ చేశారా? వంటి ఆసక్తికర అంశాలతో తమిళంలో రూపొందిన చిత్రం ‘తుప్పరివాలన్‌’.

మిస్కిన్‌ దర్శకత్వంలో విశాల్‌ హీరోగా జి.హరి నిర్మించారు. అనూ ఇమ్మాన్యుయేల్, ఆండ్రియా కథానాయికలు. ఈ సినిమాను తెలుగులో ‘డిటెక్టివ్‌’ పేరుతో వచ్చే నెల 10న విడుదల చేయనున్నారు. ‘‘తమిళంలో విశాల్‌ కెరీర్‌లో ఫస్ట్‌ వీక్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రమిది. తెలుగులోనూ సూపర్‌హిట్‌ అవుతుంది’’ అన్నారు నిర్మాత హరి. ప్రసన్న, కె.భాగ్యరాజ్, సిమ్రాన్, జాన్‌ విజయ్, అభిషేక్‌ శంకర్, జయప్రకాశ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి అరోల్‌ కొరెల్లి స్వరకర్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement