రానా హీరోగా ‘విరాటపర్వం 1992’ | Virata Parvam 1992 With Rana Daggubati And Sai Pallvi | Sakshi
Sakshi News home page

Nov 1 2018 1:29 PM | Updated on Nov 1 2018 4:27 PM

Virata Parvam 1992 With Rana Daggubati And Sai Pallvi - Sakshi

హీరో, విలన్‌, క్యారెక్టర్ అన్న తేడా లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో రానా. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తున్న రానాతో కలిసి పనిచేసేందుకు యువ దర్శకులు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ప్రయోగాత్మక చిత్రాలకు రానా ఫస్ట్‌ చాయిస్‌ అవుతున్నాడు.

తాజాగా రానా ఖాతాలో మరో డిఫరెంట్‌ మూవీ వచ్చి చేరింది. నీదీ నాదీ ఒకే కథ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఉడుగుల తరువాత విరాటపర్వం 1992 అనే కథను సిద్ధం చేసుకున్నాడు. ముందుగా ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తాడన్న టాక్ వినిపించింది.

తరువాత నితిన్‌, శర్వానంద్ లాంటి హీరోల పేర్లు వినిపించినా రానా ఫైనల్‌ అయినట్టుగా తెలుస్తోంది. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తురన్న ఈ సినిమా పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కనుందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement