అన్నీ మంచి శకునములే... | virabhadram Chaudhary the film is directed by Ravi Teja playing the lead tamannane | Sakshi
Sakshi News home page

అన్నీ మంచి శకునములే...

Sep 25 2013 1:08 AM | Updated on Aug 28 2018 4:30 PM

అన్నీ మంచి శకునములే... - Sakshi

అన్నీ మంచి శకునములే...

మిల్కీ బ్యూటీ తమన్నాకు ప్రస్తుతం శుక్రమహర్దశ నడుస్తున్నట్లుంది. బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగు సినిమా ఒక్కటి కూడా ఈ ముద్దుగుమ్మ చేతిలో లేదంటూ ఓ పక్క మీడియా కోడై కూస్తుంటే..

మిల్కీ బ్యూటీ తమన్నాకు ప్రస్తుతం శుక్రమహర్దశ నడుస్తున్నట్లుంది. బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగు సినిమా ఒక్కటి కూడా ఈ ముద్దుగుమ్మ చేతిలో లేదంటూ ఓ పక్క మీడియా కోడై కూస్తుంటే.. అందరూ అవాక్కయ్యేలా తెలుగులో కూడా వరుస అవకాశాలను తమన్నా సొంతం చేసుకుంటోంది. 
 
 రవితేజ కథానాయకునిగా బాబీ దర్శకత్వంలో రూపొందే సినిమాలో హన్సిక ఓ కథానాయికగా నటిస్తుండ గా, మరో నాయికగా తమన్నాను తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే నిజమైతే... రవితేజ, హన్సిక, తమన్నా కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే అవుతుంది. 
 
 అలాగే... వీరభద్రం చౌదరి దర్శకత్వంలో రవితేజ నటించే సినిమాలోనూ తమన్నానే కథానాయికట. మహేష్‌బాబు, శ్రీనువైట్ల ‘ఆగడు’లో కూడా తమన్నా హీరోయిన్‌గా నటించనున్న విషయం తెలిసిందే. మొత్తంగా చూస్తే వచ్చే ఏడాది తమన్నా నామ సంవత్సరం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement