మార్చి 15న ‘వినరా సోదర వీర కుమారా’ | Vinaraa Sodara Veera Kumaraa Movie Release Date | Sakshi
Sakshi News home page

మార్చి 15న ‘వినరా సోదర వీర కుమారా’

Mar 5 2019 3:17 PM | Updated on Mar 5 2019 3:17 PM

Vinaraa Sodara Veera Kumaraa Movie Release Date - Sakshi

లక్ష్మణ్ సినీ విజన్స్ బ్యానర్ లో శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం ‘వినరా సోదర వీర కుమార’. లక్ష్మణ్ క్యాదారి నిర్మాణంలో సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వం  వహిస్తున్న ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో నిర్మాత లక్ష్మణ్ క్యాదారి మాట్లాడుతూ.. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎంతో కష్టపడి ఒక మంచి పాయింట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేయనున్నాము. ఏడాదిన్నర పాటు ఈ ప్రాజెక్ట్ పైనే కష్టపడ్డారు దర్శకుడు సతీష్. అందరినీ మెప్పించాలని చేసిన ఈ మా  ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం అని అన్నారు.

దర్శకుడు సతీష్ మాట్లాడుతూ.. అవకాశం ఇచ్చిన నిర్మాత లక్ష్మణ్ కు నేను జన్మాతం రుణపడి ఉంటాను. ఒక కొత్త పాయింట్‌తో సినిమాను తెరకెక్కించడం జరిగింది. సినిమా చూసిన వారందరూ ఎంతో మెచ్చుకున్నారు. అందరి సపోర్ట్‌తో ఈ 15న సినిమాను విడుదల చేయనున్నాము. అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నా అని తెలిపారు.

హీరో శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ  సినిమా ట్రైలర్‌ను నిర్మాత దిల్ రాజు గారు విడుదల చేసారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. కొత్త పాయింట్ తో కొత్త వారితో చేసిన సినిమా అందరి ఆదరణ పొందుతుందని నమ్మకంగా ఉన్నాను. ఇదివరకు నేను చేసిన సినిమాల కంటే బెటర్  సినిమా అవుతుందని భావిస్తున్నా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement