breaking news
Sateesh chandra
-
మార్చి 15న ‘వినరా సోదర వీర కుమారా’
లక్ష్మణ్ సినీ విజన్స్ బ్యానర్ లో శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం ‘వినరా సోదర వీర కుమార’. లక్ష్మణ్ క్యాదారి నిర్మాణంలో సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నిర్మాత లక్ష్మణ్ క్యాదారి మాట్లాడుతూ.. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎంతో కష్టపడి ఒక మంచి పాయింట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేయనున్నాము. ఏడాదిన్నర పాటు ఈ ప్రాజెక్ట్ పైనే కష్టపడ్డారు దర్శకుడు సతీష్. అందరినీ మెప్పించాలని చేసిన ఈ మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం అని అన్నారు. దర్శకుడు సతీష్ మాట్లాడుతూ.. అవకాశం ఇచ్చిన నిర్మాత లక్ష్మణ్ కు నేను జన్మాతం రుణపడి ఉంటాను. ఒక కొత్త పాయింట్‌తో సినిమాను తెరకెక్కించడం జరిగింది. సినిమా చూసిన వారందరూ ఎంతో మెచ్చుకున్నారు. అందరి సపోర్ట్‌తో ఈ 15న సినిమాను విడుదల చేయనున్నాము. అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నా అని తెలిపారు. హీరో శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత దిల్ రాజు గారు విడుదల చేసారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. కొత్త పాయింట్ తో కొత్త వారితో చేసిన సినిమా అందరి ఆదరణ పొందుతుందని నమ్మకంగా ఉన్నాను. ఇదివరకు నేను చేసిన సినిమాల కంటే బెటర్ సినిమా అవుతుందని భావిస్తున్నా అన్నారు. -
సీఎంవోలో సతీష్ చంద్ర కీలకం!
త్వరలో కేంద్ర సర్వీసుకు వెళ్లనున్న అజయ్ సహానీకి శాఖల కోత సతీష్ చంద్రకు జీఏడీ, నూతన రాజధాని సహా పలు శాఖలు సాక్షి, హైదరాబాద్: ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య కార్యదర్శిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర సీఎంవోలో ఇక కీలక అధికారిగా మారనున్నారు. త్వరలో కేంద్ర సర్వీసుకు వెళ్లనున్న ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీ శాఖల్లో భారీగా కోతలు విధించడం, అనేక శాఖలను సతీష్ చంద్రకు అప్పగించడంతో ఈ విషయం స్పష్టమవుతోంది. తన పేషీ అధికారులు చూడాల్సిన శాఖల్లో (సబ్జెక్టుల్లో) సీఎం తాజాగా అనేక మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుతం అజయ్ సహాని నిర్వహిస్తున్న సాధారణ పరిపాలన శాఖ, నూతన రాజధాని, ముఖ్యమంత్రి కార్యాలయం నిర్వహణ, మహిళా శిశు సంక్షేమం, న్యాయ, అసెంబ్లీ, ఐటీ. అటవీ పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక అంశాలతో పాటు ఎవరికీ కేటాయించని అంశాలన్నింటినీ సతీష్ చంద్రకు కేటాయించారు. ప్రస్తుతం సీఎం మరో ముఖ్య కార్యదర్శి గిరిధర్ దగ్గర ఉన్న మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖను, అలాగే సీఎం కార్యదర్శి సాయి ప్రసాద్ దగ్గరున్న పర్యావరణ, అటవీ శాఖలను సతీష్ చంద్రకు కేటాయించారు. దీంతో గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యవహరించినట్లే ఇప్పుడు కూడా సీఎంవోలో సతీష్ చంద్ర కీలకంగా వ్యవహరిస్తారనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక అజయ్ సహానీకి కేవలం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖను మాత్రమే ఉంచారు. గిరిధర్‌కు మున్సిపల్, హోం, ఆర్థిక, వ్యవసాయం, అన్ని రకాల విద్యలు, రెవెన్యూ శాఖలను కేటాయించారు. సాయిప్రసాద్‌కు ఇంధన, పరిశ్రమలు, ఇరిగేషన్, గృహ నిర్మాణం, అన్ని రకాల సంక్షేమం, కార్మిక, పంచాయతీరాజ్ శాఖలను కేటాయించారు.