విలన్ పాత్రకు కత్తెర | villain role in dhruva shortened | Sakshi
Sakshi News home page

విలన్ పాత్రకు కత్తెర

Dec 4 2016 12:45 PM | Updated on Sep 4 2017 9:54 PM

విలన్ పాత్రకు కత్తెర

విలన్ పాత్రకు కత్తెర

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ధృవ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ధృవ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్లో ఘనవిజయం సాధించిన తనీఒరువన్కు ధృవ రీమేక్గా తెరకెక్కింది. ఒరిజినల్ వర్షన్లో హీరోకు ధీటుగా కనిపించే విలన్ పాత్రలో నటించిన అరవింద్ స్వామి, తెలుగు వర్షన్ లోనూ విలన్ రోల్లో నటిస్తున్నాడు.

అయితే ఒరిజినల్ వర్షన్ విలన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. దాదాపు హీరో కనిపించినంత సేపు విలన్ కూడా తెర మీద కనిపిస్తాడు. కానీ తెలుగు వర్షన్లో మాత్రం  ఆ క్యారెక్టర్కు ఉన్న ఇంపార్టెన్స్కు కోత పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. తమిళ్తో పొలిస్తే ధృవ సినిమాలో అరవింద్ స్వామి పాత్ర చాలా తక్కువగా ఉంటుందట. అయితే కోలీవుడ్లో సక్సెస్లో కీ రోల్ ప్లే చేసిన విలన్ క్యారెక్టర్కు కోత పెడితే.., తెలుగులో సినిమా రిజల్ట్ తేడా పడే చాన్స్ ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement