సామి సీక్వల్లో విక్రమ్ | Vikram teams up with director Hari for 'Saamy 2' | Sakshi
Sakshi News home page

సామి సీక్వల్లో విక్రమ్

Aug 3 2016 2:48 PM | Updated on Sep 4 2017 7:40 AM

సామి సీక్వల్లో విక్రమ్

సామి సీక్వల్లో విక్రమ్

కొంత కాలంగా ప్రయోగాత్మక చిత్రాలు మాత్రమే చేస్తూ వస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, త్వరలో ఓ మాస్ మసాలా ఎంటర్టైనర్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో విక్రమ్ హీరోగా సామి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన...

కొంత కాలంగా ప్రయోగాత్మక చిత్రాలు మాత్రమే చేస్తూ వస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, త్వరలో ఓ మాస్ మసాలా ఎంటర్టైనర్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో విక్రమ్ హీరోగా సామి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన హరి దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సూర్య హీరోగా సింగం సినిమాకు రెండో సీక్వల్ను రూపొందిస్తున్న హరి, విక్రమ్ హీరోగా కూడా సీక్వల్నే రూపొందించే ఆలోచనలో ఉన్నాడు.
 
ఇటీవల విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఇరుముగన్ సినిమా ఆడియో ఫంక్షన్లో పాల్గొన్న డైరెక్టర్ హరి, త్వరలోనే విక్రమ్తో సినిమా చేయనున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం సింగం 3ని రూపొందిస్తున్న ఈ దర్శకుడు విక్రమ్తో సామి సినిమాకు సీక్వల్ను రూపొందిస్తానని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ చాలా కాలం కిందే  మొదలవ్వాల్సి ఉన్నా.. వాయిదా పడుతూ వచ్చిందని.. త్వరలోనే మొదలవుతుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement