అదే బ్యానర్‌లో మరో సినిమా..! | Vikram K Kumar Next With Naga Chaitanya | Sakshi
Sakshi News home page

Dec 12 2017 2:08 PM | Updated on Jul 15 2019 9:21 PM

Vikram K Kumar Next With Naga Chaitanya - Sakshi

మనం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న దర్శకుడు విక్రమ్ కె కుమార్ ప్రస్తుతం అఖిల్ హీరోగా హలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ప్రతిష్టాత‍్మకంగా ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అఖిల్ సరసన కళ్యాణీ ప్రియదర‍్శన్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.

ఈ సినిమా పనులు పూర్తి కాకముందే నాగార్జున.. విక్రమ్‌తో మరో సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం అఖిల్ హీరోగా హలో సినిమా తెరకెక్కిస్తున్న విక్రమ్, తన తదుపరి చిత్రాన్ని నాగచైతన్య హీరోగా రూపొందించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. విక్రమ్ డెడికేషన్, వర్కింగ్ స్టైల్ నచ్చిన కింగ్ వరుస సినిమాలకు అవకాశం ఇస్తున్నాడట. ప్రస్తుతానికి నాగార్జున టీం నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా.. హలో ప్రచార కార్యక్రమాల్లోనే ఈ సినిమాపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement