రజనీ సినిమాల తర్వాత అదే టాప్ | Vijay's 'Theri' off to a flyer in the US | Sakshi
Sakshi News home page

రజనీ సినిమాల తర్వాత అదే టాప్

Apr 15 2016 12:54 PM | Updated on Apr 4 2019 5:12 PM

రజనీ సినిమాల తర్వాత అదే టాప్ - Sakshi

రజనీ సినిమాల తర్వాత అదే టాప్

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన 'తేరి' సినిమా అమెరికాలో రికార్డులు సృష్టిస్తోంది.

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన 'తేరి' సినిమా అమెరికాలో రికార్డులు సృష్టిస్తోంది. మొదటి రోజు ఏకంగా రూ. 1.67 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు అక్కడ తమిళంలో విడుదలైన సినిమాల్లో రజనీకాంత్ నటించిన రోబో, లింగా సినిమాల తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'తేరి' నిలిచింది. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా కొత్త సంవత్సరానికి సరైన బహుమతి అవుతుందని ఈ సినిమాకు ఉత్తర అమెరికా పంపిణీదారులు సినీగెలాక్సీ చెబుతోంది.

అట్లీ దర్శకత్వం వహించిన తేరి సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా విడుదలైంది. అమెరికాలో బుధవారమే ప్రీమియర్లను తాకింది. బుధవారం నాటి ప్రీమియర్ షోలోనే ఇది రూ. 1.67 కోట్లు వసూలు చేసినట్లు సినీ గెలాక్సీ ప్రతినిధులు చెప్పారు. ఓ మాజీ పోలీసు అధికారికి, అతడి కూతురికి మధ్య సంబంధం గురించి చెప్పే ఈ సినిమాలో సమంత, అమీజాక్సన్ ఇద్దరూ హీరోయిన్లుగా నటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement