లాక్‌డౌన్‌.. 9.30 గంటలు బెడ్‌పైనే స్టార్‌ హీరో | Vijaydevara konda posts Be the real man challenge video | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌.. 9.30 గంటలు బెడ్‌పైనే స్టార్‌ హీరో

Apr 25 2020 12:51 PM | Updated on Apr 25 2020 1:47 PM

Vijaydevara konda posts Be the real man challenge video - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌లో తన అనుభవాలను స్టార్‌ హీరో విజయ్ దేవరకొండ అభిమానులతో పంచుకున్నాడు. కొరటాల శివ ఇచ్చిన ‘బి ది రియల్ మ్యాన్’ సవాలును విజయ్‌ స్వీకరించాడు. తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ వీడియో తీస్తుంటే, రోజు వారి పనుల్లో విజయ్‌ తన వంతు సాయం చేశాడు. దీనికి సంబంధించి వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు. ఇక నీ వంతు అంటూ దుల్కర్‌ సల్మాన్‌కి ‘బి ఏ రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌కు నామినేట్ చేశాడు.

విజయ్‌ పోస్ట్‌ చేసిన వీడియోలో.. తాను సాధరణంగా రోజుకి సగటున 6 గంటలు పడుకుంటే, లాక్‌డౌన్‌లో సగటున 9.30 గంటలు బెడ్‌పైనే నిద్రపోతున్నానని పేర్కొన్నాడు. ఉదయం దుప్పట్లు మడతపెట్టాడు. నీటిని బాటిళ్లలో నింపుతూ.. వైన్‌ బాటిళ్లను వాటర్‌ బాటిళ్లుగా కూడా వాడొచ్చని సూచించాడు. మంచి ఆరోగ్యం కోసం ఉదయంలేవగానే ఒక లీటర్‌ నీరు తాగాలని కోరాడు.

డస్ట్‌ బిన్‌లోని చెత్తను సులువుగా తీయడానికి, పాత కవర్లను చెత్తడబ్బాలో పేరిస్తే, చెత్త తీయడం సులువు అవుతుందని పేర్కొన్నాడు. టీవీని శుభ్రం చేసి వీడియోగేమ్‌ ఆడాడు. ఆ త‌ర్వాత మ్యాంగో ఐస్ క్రీమ్ త‌యారు చేసి త‌న కుటుంబ స‌భ్యుల‌కి అందించాడు. ప్రపంచంలో మనల్ని ఇష్టపడేవారు పక్కనే ఉంటే సంక్షోభం అనేదే ఉండదని, అలాలేని వారి కోసం ప్రార్థిస్తున్నట్టు తెలిపాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement