విజయ్‌సేతుపతితో జత కడుతుందా? | Vijay Sethupathi to romance Hansika Motwani | Sakshi
Sakshi News home page

విజయ్‌సేతుపతితో జత కడుతుందా?

Oct 25 2015 2:37 AM | Updated on Apr 3 2019 9:05 PM

విజయ్‌సేతుపతితో జత కడుతుందా? - Sakshi

విజయ్‌సేతుపతితో జత కడుతుందా?

యువ కథానాయకులు క్రేజీ కథానాయికలతో నటించాలని ఆశ పడుతున్నారు.అదే విధంగా ప్రముఖ కథానాయికలూ

యువ కథానాయకులు క్రేజీ కథానాయికలతో నటించాలని ఆశ పడుతున్నారు.అదే విధంగా ప్రముఖ కథానాయికలూ వర్ధమాన కథానాయకులతో నటించడానికి ఏమాత్రం సందేహించడం లేదు. ఆ మధ్య శివకార్తీకేయన్‌తో క్రేజీ నటి హన్సిక మాన్‌కరాటే చిత్రంలో నటించి, ఆ చిత్ర విజయానికి ఒక కారణం అయ్యారు. అదే విధంగా లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార మాయ చిత్రంలో వర్ధమాన నటుడు ఆరితో నటించి ఆ చిత్ర విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక మరో యువ నటుడు విజయ్‌సేతుపతితో ఈ సంచలన భామ నటించిన నానుమ్ రౌడీదాన్ చిత్రం ఇటీవలే తెరపైకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. ఇలా ప్రముఖ నటీమణులతో యువనటులు నటించిన చిత్రాల ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో దర్శక నిర్మాతలు అలాంటి ప్రయత్నాలతో ముందుకు సాగుతున్నారు.

నానుమ్ రౌడీదాన్ చిత్రంలో నయనతారతో నటించిన విజయ్‌సేతుపతి తదుపరి సొట్ట బుగ్గల సుందరి హన్సికతో రొమాన్స్ చెయ్యాలని ఆశ పడుతున్నారు. వరుస ఫ్లాప్‌ల తో సతమతమవుతున్న ఈ యువ హీరోకు నానుమ్ రౌడీదాన్ చిత్ర విజయం కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఆ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఆరెంజ్‌మిఠాయ్ చిత్రం తరువాత కామన్‌మాన్ పతాకంపై పి.గణేశ్ నిర్మించనున్న తాజా చిత్రంలో విజయ్‌సేతుపతి హీరోగా నటించనున్నారు. ఇంతకు ముందు అరుణ్‌విజయ్ హీరోగా వాడీల్ చిత్రాన్ని తెరకెక్కించిన రత్నశివ దర్శకత్వం వహించనున్న రెండో చిత్రం ఇది.

 లవ్, యాక్షన్, కామెడీ అంశాలతో కూడిన ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రలో నటి హన్సికను నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఆ ముద్దుగుమ్మ విజయ్‌సేతుపతితో నటించడానికి అంగీకరిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్ర షూటింగ్‌ను మధురై, కోవై, కుంభకోణం తదితర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement