
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్‌చరణ్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన ప్రముఖ నటులు నటిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, సాండల్‌వుడ్ స్టార్ సుధీప్‌ల లుక్ రివీల్ చేసిన చిత్రయూనిట్ తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లుక్‌ను రిలీజ్ చేశారు.
బుధవారం విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా సైరా సినిమాలోని ఆయన లుక్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విజయ్ రాజా పాండీ పాత్రలో కనిపించనున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, తమన్నా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.