ఫైటర్‌ విజయ్‌

Vijay Deverakonda and Puri Jagannadh film titled Fighter - Sakshi

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తో పూరి జగన్నాథ్‌ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ అందుకున్నారు. ఈ సక్సెస్‌ జోష్‌లోనే మరో హిట్‌ సాధించాలని స్రిప్ట్‌ వర్క్‌ని స్టార్ట్‌ చేశారు. విజయ్‌ దేవరకొండను హీరోగా సెలెక్ట్‌ చేసుకున్నారు పూరి. ఈ సినిమాను పూరి జగన్నాథ్, చార్మీ నిర్మించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం కోసం మార్షల్‌ ఆర్ట్స్‌లో విజయ్‌ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారని తెలిసింది. ప్రీప్రొడక్షన్‌ కార్యక్రమాలన్నింటిని పూర్తి చేసుకుని జనవరి నుంచి చిత్రీకరణ మొదలుపెట్టా లేనుకుంటున్నారు. హీరోయిజాన్ని ఓ లెవల్లో చూపించే పూరి...విజయ్‌ దేవరకొండను ఏ మాస్‌ యాంగిల్‌లో ప్రజెంట్‌ చేయబోతున్నారా? అని విజయ్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top