రైటర్‌గా విజయ్‌ దేవరకొండ

Vijay Devarakonda as Writer in Kranthi Madhav Film - Sakshi

టాలీవుడ్ సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విజయ్‌ హీరోగా తెరకెక్కిన డియర్‌ కామ్రేడ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలతో పాటు క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు విజయ్‌. ఈ సినిమాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్‌ తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా కోసం రెడీ అవుతున్నాడు.

తాజాగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ ఒకటి వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విజయ్‌, రచయితగా కనిపించనున్నాడట. తాను రాసిన కథల్లోని హీరో పాత్రల్లో తానే కనిపించే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేయస్‌ రామారావు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top